MLAs : ఎన్టీఆర్ తోనే బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ ఫలాలు

TRINETHRAM NEWS

విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి…

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం పసలపూడి, రాష్ట్రంలో బడుగు, సంక్షేమ ఫలాలకు నాంది పలికింది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అన్నారు. సోమవారం పసలపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం వేగుళ్ల మాట్లాడుతూ తొలిసారి వృద్ధులకు పింఛను అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని చెప్పారు. ఎన్నికల హామీ ప్రకారం పెంచిన పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు.

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి (కూర్మాపురం అబ్బు) మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీని మేళతాళాలతో శిర్డీసాయి ఆలయం నుంచి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR alone is the

You cannot copy content of this page

Scroll to Top