WhatsApp Image 2024 02 21 at 12.35.48
Trinethram News : కృష్ణాజిల్లా కూచిపూడి
పెళ్లై మూడు సంవత్సరాలైనా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.
నీలిచిత్రాల్లో లాగా ప్రవర్తించాలంటూ…
భార్యపై ఒత్తిడి తెస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసిన దిశా పోలీసులు..!
పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతికి 2021, ఏప్రిల్లో వివాహమైంది.
కట్నం కింద రూ.2లక్షలు, రూ.50వేల విలువైన గృహోపకరణాలు ఇచ్చారు.
భర్త కృష్ణా జిల్లా కూచిపూడిలో కిరాణా హోల్సేల్ దుకాణం నిర్వహిస్తుంటారు.
రూ. లక్ష అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడు.
దీనికి అత్త, మరిదిలు వత్తాసు పలుకుతున్నారు.
తన దుకాణంలో పనిచేసే యువతితో అతడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య నిలదీసింది.
ఆ తర్వాత నుంచి ఆమెకు చరవాణిలో నీలిచిత్రాలు బలవంతంగా చూపిస్తూ, అలా ప్రవర్తించాలని ఒత్తిడి చేస్తున్నాడు.
భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది.
బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భర్త, అత్త, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
