పండుగలవేల మరింత జాగ్రత్త అవసరం
త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి. షాబాద్ మండల్ కేంద్రంలోని షాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ కాంత రెడ్డి సైబర్ నేరాలపై అవగాహన గురించి సిఐ కాంతారెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల వల్ల ప్రజలు భారీగా ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నకిలీ సందేశాలు అనుమానస్పంద లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ముఖ్యంగా పండుగ సమయాలలో బహుమతులు క్యాష్ బ్యాక్ లు డిస్కౌంట్ ఆఫర్లు పేరుతో పంపిస్తున్న నకిలీ లింకులను ఎటు పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు బ్యాంక్ ఖాతా వివరాలు ఓటీపీలు ఏటీఎం సమాచారం వ్యక్తిగత వివరాలను ఎవరికి చెప్పరాదని స్పష్టం చేశారు తెలియని లింకులపై క్లిక్ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ మోసాలు లేదా ఆన్లైన్ నేరాలకు గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించడంతో పాటు జాతీయ సైబర్ నేరాల సహాయ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


