ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం
మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి
అసమర్ధ కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలకు అన్యాయం
-ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం.
-ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తాం
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 03 త్రినేత్రం న్యూస్. ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో తరిమికొడదాం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం దేవరకొండ పట్టణంలోనీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందినశ్రీకాంత్ తోపాటు 50 మంది యువకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని ఆయన అన్నారు.అసమర్ధ కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారు అని ఆయన తెలిపారు.
ఆరు గ్యారంటీల మోసాన్ని, 420హామీలను ప్రజలకు వివరించాలి అని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన తెలిపారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా అని ఆయన తెలిపారు.తెలంగాణలో రైతుల కన్నీటి గాధ అని,కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడుతున్న తెలంగాణ ప్రజలు అని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా రేవంత్ ప్రభుత్వానికి లేదు అని ఆయన అన్నారు.ఇది ప్రజా ప్రభుత్వం కాదు, పనికిరాని ప్రభుత్వం అని ఆయన పేర్కొనారు.కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి అని ఆయన తెలిపారు.స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు.నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు, ఉప్పుగంటి ప్రశాంత్ రావు, రాఘవ చారి, పెద్దయ్య, ప్రవీణ్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


