జూలై 6, 2026
TRINETHRAM NEWS
Balu Naik Meets Deputy CM

Balu Naik Meets Deputy CM : దేవరకొండ డివిజన్ జులై 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి , విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరకొండ నియోజకవర్గం లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఎం ఎల్ ఏ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విద్యుత్ లైన్ల విస్తరణ , తదితర అంశాలపై డిప్యూటీ సీఎం కు వినతిపత్రం సమర్పించారు ప్రజలకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి భ విక్రమార్క దేవరకొండ నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు దేవరకొండ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page