Baby Dies : చికిత్స పొందుతూ బాలింత మృతి

TRINETHRAM NEWSడాక్టర్ నిర్లక్ష్యం గర్భిణీ నిండు ప్రాణం బలి. మృతదేహంతో ఆస్పత్రి వద్ద ఆందోళన. డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన వీరటీ అంజనమ్మ (24 సం..

TRINETHRAM NEWS

డాక్టర్ నిర్లక్ష్యం గర్భిణీ నిండు ప్రాణం బలి.

మృతదేహంతో ఆస్పత్రి వద్ద ఆందోళన.

డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన వీరటీ అంజనమ్మ (24 సం “లు) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇద్దరు పిల్లలకు సుఖ ప్రసవం జరగడంతో మూడో ప్రసవంలో భాగంగా సెప్టెంబర్ 6న కల్వకుర్తి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం తక్కువగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించి అదే రోజు శస్త్ర చికిత్స చేయగా ఆడ శిశువు జన్మించింది. ప్రసవం తర్వాత రక్తస్రావం ఎక్కువవడంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సిఫారసు చేయడంతో అక్కడికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ అంజనమ్మ మరణించడం జరిగింది. వైద్యం వికటించడంతోనే మరణించిందని కుటుంబ సభ్యులు బంధువులు, గ్రామస్తులు కల్వకుర్తిలోని ఆసుపత్రి ఎదుటకు చేరుకున్నారు. ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద బైఠాయించి బాలింత మృతి చెందడంతో ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏమిటని ?న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్వష్టం చేసిన ససే మీరా అంటూ నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Baby dies while receiving treatment

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page