రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బిహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గంలో పేదలకు అండగా సామాజిక సేవలు నిర్వహిస్తూ అమెరికాలో బి ఆర్ ఎస్ పార్టీకి ఎన్ఆర్ఐ నాయకులుగా వ్యవహరించిన రామగుండం ముద్దుబిడ్డ వ్యాళ్ళ హరీష్ రెడ్డి తెలంగాణలోని మాతృ స్థలం రామగుండం నియోజకవర్గం లోని పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు. వ్యాళ్ల హరీష్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైనా పాత్ర పోషించేందుకు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించేందుకు, ప్రజల పక్షాన, పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసేందుకు వస్తున్న వ్యాళ్ల హరీష్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు
. రామగుండం నియోజకవర్గం గోదావరిఖని నుండి ఈ ప్రాంత నాయకులు వందలాది మంది కార్యకర్తలు అభిమానులు, ప్రజలు హైదరాబాద్ విమానాశ్రయానికి సుమారు 50వాహనాలలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాహిద్ పాష, పోలాడి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి, బురుగు వంశీకృష్ణ, రామస్వామి, బోట్ల పోషం, పిడుగు శ్రీనివాస్, అతహారుద్దీన్, అబ్దుల్ గపూర్, రంగు దుర్గాప్రసాద్, మాడిశెట్టి రవి, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


