త్రినేత్రం న్యూస్: జనవరి 13: నెల్లూరు జిల్లా :కావలి పోలీస్ శాఖకు ఐదు బొలెరో నియో వాహనాల అందజేత.. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఐదు బొలెరో వాహనాలను కావలి నియోజకవర్గం లోని పోలీసు శాఖ పరిధిలోని స్టేషన్లకు బిఎంఆర్ సంస్థల ద్వారా అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మరియు బిఎంఆర్ సంస్థల అధినేత బీద మస్తాన్ రావు యాదవ్ , తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ ,బీద రవిచంద్ర , జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఐ.పీ.ఎస్ , మరియు సంబంధిత డిఎస్పీలు, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి.ఎన్.ఆర్, సంస్థల అధినేత మరియు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ , మాట్లాడుతూ అల్లూరు, బోగోలు, దగదర్తి, కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల్లో దాదాపు 1.85 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇంత విస్తారమైన గ్రామీణ ప్రాంతంలో ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కష్టపడుతోంది.
త్వరితంగా స్పందించేందుకు, దూర ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు పోలీస్ అధికారులకు వాహనాలు ఎంతో అవసరం అని నేను భావిస్తున్నాను. మా తమ్ముడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర , దక్షిణ కోస్తా గుంటూరు రేంజ్, ఐ.జీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇచ్చిన సూచన మేరకు, అలాగే నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐ.పీ.ఎస్, తో, చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం. పోలీస్ శాఖ సేవలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, బి. ఎమ్ .ఆర్ .సంస్థలు మరియు మా మిత్రుల సహకారంతో ఐదు బొలెరో నియో వాహనాలను అందజేస్తున్నాము.
ఈ వాహనాలను ఎస్సై అల్లూరు, ఎస్సై బోగోలు, ఎస్సై దగదర్తి, ఇన్స్పెక్టర్ కావలి రూరల్ సర్కిల్, మరియు కావలి రూరల్ ఎస్‌హెచ్‌ఓలకు వినియోగార్థంగా కేటాయించాము. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణలో ముందు వరుసలో నిలిచి సేవలందిస్తున్న పోలీస్ శాఖకు సహకరించడం మా బాధ్యత. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖకు అవసరమైన ప్రతి విషయంలో బి.ఎం.ఆర్, సంస్థలు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తాయి. అని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


