త్రినేత్రం న్యూస్ :జనవరి 13: తిరుపతి జిల్లా:రేణిగుంట మండలం.. కాలనీలో కనీస సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలి కార్తీక్ డిమాండ్
రేణిగుంట; జీపాళ్యం పంచాయితీలో పద్మనగర్,కొత్త కాలనీలో రోడ్లు, సైడ్ కాలవలు, లైట్లు,నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అల్ ఇండియా ట్రెడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) రేణిగుంట మండల కార్యదర్శి కార్తిక్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి బాల్ రెడ్డికి ,వినత పత్రం ఇవ్వడం జరిగింది
దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నివాస స్థలాలలో 70 కుటుంబాలు పైన నివాసం ఉంటున్నారు రోడ్లు సక్రంగా లేక ముళ్ల పొ దులుతో ఇబ్బంది పడుతూ రాత్రివేళ లైట్లు లేక విష పూరితమైన కీటకాలతో ఇబ్బందులు పడుతున్నారు కనీసం దహన క్రియలకు స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అ క్కడ నివసిస్తున్నటువంటి కుటుంబకులకు ఇంటి పన్నును ఏర్పాటు చెయ్యాలి మౌలిక వసతులు కల్పించాలని కోరారు
అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ హామీలు ఇస్తున్నారు తప్ప అమలుకు నోచుకోక కాలనీలలో నివాసముంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి కాలనీలో సైడ్ కాలవల నిర్మాణం వీధిలైట్ల ఏర్పాటు స్మశాన వాటికను వెంటనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుంది అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో, సెల్వ,అమ్ములు,శివగామి, చంద్ర, బి. అమ్ములు, మణి, హరి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


