జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్ట్ నీటి విడుదలకు మండల కేంద్రంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా గెస్ట్ హౌస్ లో శనివారం ఆయకట్టు రైతులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై వానాకాలం ( ఖరీఫ్ )వరి పంట సాగు నిమిత్తం నీటి విడుదలకు ఏకగ్రీవం గా తీర్మానించారు. ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధులతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి ఎలమంద, అసిస్టెంట్ ఇంజనీర్ అధికారి రమేష్ మాట్లాడుతూ రైతు తీర్మానము జిల్లా అధికారులకు పంపించి నీటి విడుదలకు సన్నహలు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 17 అడుగులు కాగా మొత్తం ప్రాజెక్టు నీటి నిలువ 36 అడుగులు ఈనెల 30వ తేదీన నీటి విడుదలకు శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ చేతుల మీదుగా జరుగుతుందని వారు తెలిపారు .ఈ సమావేశంలో రైతులు దొంతినేని వెంకటేశ్వరరావు ,కురుమారెడ్డి, రుక్మారెడ్డి, తుమ్ నాగార్జున రెడ్డి ,ఏమి రెడ్డి వెంకట్ రెడ్డి ,తూమ్ బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి ,మైనుద్దీన్, గోపాల్ రావు ,లక్పతి నాయక్, పునీత్ రెడ్డి ,పొలం లక్ష్మణ్, గడ్డమీది సాయి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi project water release.

You cannot copy content of this page