‘ULLAS’ : వయోజన విద్య’ఉల్లాస్’పై అవగాహనా సదస్సు

TRINETHRAM NEWS

నిరక్షరాస్యులయిన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయడమే ఉల్లాస్ యొక్క ఉద్దేశము : గోప్య నాయక్ మండల విద్యాధికారి

డిండి (గుండ్ల పల్లి)జూన్ 28, త్రినేత్రం న్యూస్. డిండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, వి. ఓ. ఎ లకు ఉల్లాస్ పై మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకన్న అధ్యక్షతన నేడు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గోప్యా నాయక్ మాట్లాడుతూ నిరక్షరాస్యులయిన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయడమే ఉల్లాస్ యొక్క ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరు కష్టపడి మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని కోరారు.

మరియు మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి బాగస్వామ్యంతో ఈపథకాన్ని కొనసాగించనున్నారని తెలిపారు ఈ సమావేశానికి మండలము లో గల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోఉపాధ్యాయులు, మహిళా సంఘ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness seminar on adult e

You cannot copy content of this page

Scroll to Top