Awareness Seminar : అట్లవారి పల్లెలో పాడి రైతులకు అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం అట్లవారి పల్లె గ్రామంలో జైకా ప్రాజెక్ట్ సహకారంతో శ్రీజ డైరీ వారు పాడి రైతులకు అవగాహన కార్యక్రమం పెనుమూరు బీఎంసీయు సూపర్వైజర్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తాయారమ్మ, ఏరియా మేనేజర్ మునికృష్ణ, పి బీ ఏ ఆఫీసర్ మురళి మరియు వెటర్నరీ అసిస్టెంట్ లక్ష్మీనరసింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునికృష్ణ మాట్లాడుతూ శ్రీజ డైరీ పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సమస్త అని, శ్రీజ డైరీలో ఉత్పత్తిదారులె డైరెక్టర్లు, మరియు చైర్మన్. పి.బి.ఐ మురళి మాట్లాడుతూ ఓర్పు సహనం పట్టుదల ఆయుధాలుగా అవకాశాలను ఒడిసి పట్టుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారని అన్నారు.

లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ పాల నాణ్యత పెరుగుదల కోసం ఆవులకు నాణ్యమైన శ్రీజ క్యాటిల్ ఫీడ్ మరియు మినరల్ మిక్చర్ కాల్షియం లివర్ టానిక్ మొదలగు నవి ఉపయోగించాలో తెలియజేస్తూ కాలానుగుణంగా పశువులకు వచ్చే జబ్బులు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. తాయారమ్మ మాట్లాడుతూ స్త్రీ శక్తికి నిలువెత్తు నిదర్శనమై శ్రీజ డైరీ దర్శనమిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరీ సిబ్బంది మరియు పాలమిత్ర పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness seminar for dairy farmers

You cannot copy content of this page

Scroll to Top