Nellore News : కొత్తూరు గ్రామాన్ని పట్టించుకోని అధికారులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 11: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం విశ్వనాథరావు పేట పంచాయితీ కొత్తూరు గ్రామం బ్రహ్మం వీధి. ఈ రోడ్ నిత్యం ట్రాక్టర్స్ ఆటో లు మోటారు సైకిల్స్ మరియు టిప్పర్ లారీలు తిరుగుతుంటాయి. చిన్న వర్షం వస్తే ఊరిమీద ఉన్న మురికి నీరు ఈ రోడ్ మీదకి వచ్చి ఆగిపోతాయి. ఈ రోడ్ కోసం ఎన్నోసార్లు నాయకులకు చెప్పి చెప్పి అలసిపోవడం జరిగింది. విచిత్రం ఏమిటంటే నాయకులకు ఓట్లు కావలసినప్పుడు మాత్రమే ఈ కొత్తూరు బ్రహ్మం విధి కనిపిస్తుంది. మరలా ఎలక్షన్స్ వస్తే కానీ అంటే 5 సంవత్సరాల తరువాత కానీ ఇక్కడ ప్రజలు గుర్తుకు రారు. వీధి లైట్ లు మేమే మా సొంత నిధులతో వేపించుకుంటున్నాం
ఈరోజు ఈ రోడ్ మా సొంత నిధులతో వేపించుకోవడం జరిగింది. అయ్యా మీరు నాయకులు అని జబ్బలు చర్చుకుని చెప్పుకోవడం కాదు కొంచెం సమస్యలు చెప్పినప్పుడు విని పరిష్కారం కూడా చెయ్యడం ఇప్పటికైనా తెలుసుకోండి, అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Authorities ignoring Kothur village

You cannot copy content of this page

Scroll to Top