త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 11 : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ లో భాగంగా అనాధలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న అమృత ఆరోగ్య పధకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత విస్తరించనుంది. జిల్లాలో రెండో విడత లో 59మందికి ఈ పధకం వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు కలెక్టరేట్ లో గౌరవ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా లబ్ధిదారులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు
తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయ కర్త డాక్టర్ ఎన్ వీ సుధీర్ కుమార్ కు సూచించారు. మొదటి విడత జిల్లాలో 518 మంది ఈ పథకం పరిధిలో ఉన్నారు. గుర్తించిన వారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవా పధకం లో అనుసంధానించ చబడిన హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3255 చికిత్సలు /శస్త్ర చికిత్సలు సహా ఏటా రూ 25లక్షలు వరకు ఉచిత వైద్యం అందిస్తోంది
ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయ కర్త డాక్టర్ ఎన్.వి.సుధీర్ కుమార్, ఐ.సి.డి.ఎస్ , పి.డి హేమా సుజన తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


