Gosh Patha Sensation : అరకువేలీ విజ్ఞానభారతి పాఠశాలలో గోష్ పథ సంచలన్

TRINETHRAM NEWS

అరకులోయ,డిసెంబర్ 11, (త్రినేత్రం న్యూస్): భారతీయ విద్యా కేంద్రం స్వర్ణోత్సవాల సందర్భంగా అరకు వ్యాలీ విజ్ఞానభారతి (బి.వి.కె) పాఠశాల ఆధ్వర్యంలో గురువారం గోష్ పథ సంచలన్ కార్యక్రమం విశిష్టంగా నిర్వహించారు. అరకువ్యాలీ విజ్ఞానభారతి పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన సంచలన్, మెయిన్ రోడ్ మీదుగా ఆంజనేయస్వామి గుడి వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో అరకువేలీ పాఠశాల నుండి 50 మంది విద్యార్థులు, పాడేరు విజ్ఞానభారతి పాఠశాల నుండి 60 మంది విద్యార్థులు, చింతపల్లి విజ్ఞానభారతి పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు పాల్గొని ఆకర్షణీయమైన ప్రదర్శనలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ విద్యా కేంద్రం డైరెక్టర్ పి. వెంకటపతి రాజా, కార్యనిర్వాహణ అధికారి ఏ.వి.యస్ ఆచార్యులు, మాజీ కరెస్పాండెంట్ సి.హెచ్. గోపినాథ్, సమితి శారీరాక్ ప్రముఖ్ ఎన్. శ్రీను, కరెస్పాండెంట్ కె. కృష్ణరావు హాజరై విద్యార్థులను అభినందించారు.
అరకువ్యాలీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. వెంకటరావు, పాడేరు ప్రధానోపాధ్యాయులు ఏ.వై. ఆచారీతో పాటు అరకువ్యాలీ, పాడేరు, చింతపల్లి ఉపాధ్యాయ బృందం కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు. పథ సంచలన్ సందర్భంగా విద్యార్థుల శారీరక ప్రదర్శనలు, క్రమశిక్షణ, దేశభక్తి నినాదాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gosh Patha Sensation at Arakuvelly Vigyan Bharathi School

You cannot copy content of this page

Scroll to Top