Ketawat Baburam Naik : తీన్మార్ మల్లన్నపై దాడి చేసినదోషులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి

TRINETHRAM NEWS

కేతావత్ బాబురాం నాయక్ .

Trinethram News : తీన్మార్ మల్లన్న పైన, ఆయన కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిని తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడైన కేతావత్ బాబురాం నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్రలే ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఇది కేవలం ఒక వ్యక్తి పై దాడి కాదు – ఇది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న చైతన్య దమనంగా పరిగణించాల్సిన ఘటన అని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మల్లన్న లాంటి నాయకులపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహమని ఆయన పేర్కొన్నారు.

ఈ దాడికి పాల్పడిన గూండాలపై వెంటనే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని, అలాగే ఈ దాడికి ప్రేరణ ఇచ్చిన నేతలపై కూడా చట్టపరమైన విచారణ జరిపి, తగినచర్యలు తీసుకోవాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attempt to murder cases

You cannot copy content of this page

Scroll to Top