జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ప్రభుత్వ పాఠశాలలను అవినీతి కేంద్రాలుగా మార్చిన MEO, DEOల పై వెంటనే చర్యలు తీసుకోకపోతే గిరిజనులు రోడ్డెక్కే దిశగా సిద్ధం”
కేతావత్ బాబురామ్ నాయక్….
దేవరకొండ జులై 13 త్రినేత్రం న్యూస్. గిరిజన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న స్కూళ్ల పునరుద్ధరణ నిర్ణయాన్ని కొన్ని క్రూర స్వార్థ శక్తులు — విద్యాశాఖలోని ముఠా అధికారులు — పూర్తిగా వక్రీకరిస్తున్నారు.
ఇంతకుముందు మూసివేసిన పాఠశాలలను తిరిగి ఓపెన్ చేస్తూ ప్రతి స్కూల్‌కి రూ.2 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ, అదే పాఠశాలను గతంలో నాశనం చేసిన ఉపాధ్యాయులనే మళ్లీ నియమించడమనే దారుణ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నియామకాల వెనుక MEOలు, DEOలు తాము నచ్చిన వ్యక్తులను లాబీల ఆధారంగా నియమిస్తూ ప్రభుత్వ పథకాలను నాశనం చేస్తున్నారు. ప్రజా నిధులను కేవలం జీతాల కొల్లగొట్టే మోసం ముఠాల చేతుల్లో పెట్టడం — ఇది ఒక అవమానం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపై పగదావాల దాడి.
ఇది విద్యా వ్యవస్థను కాపాడే ప్రక్రియ కాదని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న చివరి విశ్వాసాన్ని కూడా చంపే కుట్రగా , స్కూల్ డిప్యూటేషన్ల పేరుతో నియమాలు పట్టించుకోకుండా నియామకాలు జరపడం ద్వారా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకుంటున్నారు. గతంలో విద్యార్థులు లేరు అని మూసిన స్కూల్‌ను ఇప్పుడు రెండు లక్షల నిధులు కోసం మళ్లీ తెరిచి, అదే టీచర్లను తిరిగి పెట్టడం వల్ల ప్రభుత్వ నైతికత గాలికొదిలిపెట్టినట్టే అవుతోంది. నిబంధనలు లేకుండా టీచర్లను నియమించడం, జీవో నెంబర్లను పట్టించుకోకపోవడం, రాజకీయ ఒత్తిళ్లతో ఏ నిర్ణయం అయినా తీసుకునేలా అధికారులు ప్రవర్తించడం – ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని తక్కువ చేస్తాయి.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఇప్పటికైనా స్పందించకపోతే, ఇది కేవలం విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టడమే కాదు, ఇది గిరిజన సమాజంపై ప్రత్యక్ష దాడిగా మేం చూస్తున్నాం. విద్యా శాఖలో నైతిక విలువలు నిలవాలంటే, ఇప్పుడు ప్రభుత్వమే ప్రథమంగా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

If moral values are

You cannot copy content of this page