ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Husband kills wife

You cannot copy content of this page