వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ పట్టణ ఆధ్యాత్మిక చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆధ్యాత్మిక సేవా మండలి గంగవరం ఆధ్వర్యంలో, బాల మార్తాండ మహారాజ్ దివ్య పర్యవేక్షణలో “అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ మహోత్సవం శత చండి రాజశ్యామల యాగం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఏడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు జనవరి 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్థానిక చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో ఈ మహా యజ్ఞాలు జరగనున్నాయి. లోక కళ్యాణం, సమాజ శాంతి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పిస్తూ ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. పరమశివుని అనుగ్రహం కోసం అత్యంత శక్తివంతమైన రుద్ర పారాయణలు, హోమాలు నిర్వహించబడతాయి.
అమ్మవారి ఆశీస్సుల కోసం వందలాది మంది రుత్విక్కులచే చండీ సప్తశతి పారాయణలు జరుగుతాయి.ఈ మహా యజ్ఞం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఎటువంటి రాజకీయ పార్టీల రంగు లేకుండా, కులమతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్నారు.
భక్తి భావం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.ఏడు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక సప్తాహంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఆ దైవ ఆశీస్సులు పొందాలని ఆధ్యాత్మిక సేవా మండలి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


