ముఖ్య అతిథులుగా సి.కే. ఎం.కళాశాల ప్రిన్సిపాల్ ధర్మ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి.. వరంగల్ దేశాయిపేట రోడ్ లో గల ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో గురువారం క్రీడా దినోత్సవలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సి.కే.ఎం కళాశాల ప్రిన్సిపాల్ ధర్మరెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీరానికి మంచి వ్యాయామం, మనల్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతాయని రక్తప్రసరణ మెరుగు పరుస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయని , చదువుతోపాటు క్రీడలు మానసిక ఒత్తిడి తగ్గిస్తూ ఏకాగ్రతను పెంచుతాయని తెలిపారు.
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కే.సారంగపాణి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మన వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంత ముఖ్యము అందరూ గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడా ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్.జె.ఎస్. పరంజ్యోతి మాట్లాడుతూ… ఆటలు మనలో క్రమశిక్షణను పట్టుదలను జట్టుగా కలిసి పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని విజయం సాధించాలన్న ఓటమిని స్వీకరించాలన్న ఆటలు నేర్పుతాయని , క్రీడల ద్వారా మనం ఓటమి ఎలా ఎదుర్కోవాలో గెలిచినప్పుడు వినియంగా ఉండాలో నేర్చుకుంటామని తెలిపారు.
విద్యార్థులు నిర్వహించిన క్రీడలు పలువురిని ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


