
Assembly Siege : దేవరకొండ డివిజన్ మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. వడ్డెర్ల ఆత్మగౌరవం మరియు వారి న్యాయమైన హక్కుల సాధన కోసం మార్చి 24 (మంగళవారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా దేవరకొండ వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ‘వడ్డెర కార్పొరేషన్’ను వెంటనే ఏర్పాటు చేయాలి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వంద మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం శోచనీయం.ఇది ఈరోజు మొదలైన పోరాటం కాదు.
గత 48 ఏళ్లుగా మా జాతి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా వడ్డెర్లను ఓటు బ్యాంకులానే చూస్తున్నాయి తప్ప, మా బతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయడం లేదు.న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. గ్రామాలు, పట్టణాలు మరియు జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతాము.వడ్డెర కులస్తులందరూ ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని, మన ఆత్మగౌరవ గళాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

