హైదారాబాద్ లో డిసెంబర్ 28 న.
తెలంగాణలో 94 సర్పంచ్ లు, 47 ఉపసర్పంచ్, 68 మంది వార్డు మెంబర్లకు సన్మానం.
ఇన్చార్జి; ఇరగదిండ్ల కృష్ణ.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 24 త్రినేత్రం న్యూస్. తెలంగాణలో వడ్డెర కులానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీ నుండి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన వడ్డెర 94 మంది సర్పంచులు గా 47 మంది ఉపసర్పంచులుగా 68 మంది వార్డు మెంబర్లుగా గెలుపొందిన అందరికీ శుభకాంక్షలు ,గెలిచిన గ్రామాలలో వడ్డెర కులస్తులందరూ ఒకతాటిపై నిర్ణయం తీసుకొని ఓట్లు వేసి గెలిపించిన అన్ని కులాల వాళ్లు కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఒకరు ఇద్దరు తప్ప ఎవరు గెలవలేకపోయారు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయిల్ మల్లు నా కులం చాలా దీనమైన స్థితిలో జీవిస్తున్నారు.
వారికి ఏదో ఒక రూపకంగా సహాయం చేయాలి.వడ్డెర కులస్తులందరినీ ఒక తాటిపై తెచ్చి నెలకు మూడుసార్లు హైదరాబాదులో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వడ్డెర కులస్తులందరినీ పిలిపించి మనమందరం ఒక తాటిపై నడుచుకోవాలి.మీకు ఏ కష్టం సుఖం వచ్చినా నేనున్నాను.అంటూ ధైర్యాన్ని నింపి తన సొంత ఖర్చులతో ట్రస్టు ఏర్పాటు చేసి వడ్డెర కులం వివిధ పరిస్థితుల్లో ఉన్నవారికి పెళ్లిళ్లకు కానీ మరియు దీనమైన స్థితిలో ఉన్న కొంతమంది చనిపోయిన ఎక్కడ జరిగిన తెలంగాణలో వెంటనే వారికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి అలాగే గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో తిరిగి 21 జిల్లాలు జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ గ్రామ పట్టణ కమిటీలు పూర్తిచేసిన ఘనత ఆయిల్ మల్లు .
ఎస్సీ ఎస్టీ కులాల వారికి ప్రత్యేక గురుకులాలు ఉన్నాయి. అలాగే మా వడ్డెర కులానికి కూడా ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపించాం. అలాగే తెలంగాణలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈనెల 28,12,2025 నాడు 11 గంటలకు హైదరాబాద్ లో భాగ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గెలుపొందిన వడ్డెర కులస్తులు అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిల్ మల్లు అలాగే తెలంగాణ రాష్ట్రం గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరుగుచున్నది.కాబట్టి గెలుపొందిన వడ్డెర కులస్తులందరూ 11 గంటలకు చేరుకోవాలని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


