APPSC : ఏపీపీఎస్సీ ద్వారా జూలై 20 తేదీన లెక్చరర్ పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ: 19.7.2025

అభ్యర్థులను 45 నిమిషాల ముందుగానే అనుమతించడం జరుగుతుంది

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

తూర్పు గోదావరి జిల్లాలో జూలై 20వ తేదీన నిర్వహించనున్న లెక్చరర్ పోస్టుల రాత పరీక్ష కోసం అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు.శనివారం జిల్లా కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఏపీపీ ఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న లెక్చరర్ పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం షిఫ్ట్ (9–12) – 519 మంది అభ్యర్థులు , మధ్యాహ్నం షిఫ్ట్ (మ.2-5) – 240 మంది అభ్యర్థులు, మొత్తం 759 అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. I-DZ (I-ON DIGITAL ZONE), లూథర్ గిరి, రాజమహేంద్రవరం
పరీక్షా కేంద్రం లో పరీక్షలు నిర్వహించడం జరుగతుందని వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ మరియు తగిన గుర్తింపు పత్రంతో పరీక్షకు కనీసం 45 నిమిషాల ముందే హాజరుకావాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణ కోసం అధికారుల బాధ్యతలపై సూచనలు చెయ్యడం జరిగింది.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రిస్కింగ్, ఇతర భద్రతా ఏర్పాట్లు చెయ్యాల్సి, ఎట్టి పరిస్థితుల్లో ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించరాదని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ లు కలెక్షన్ కోసం కాలేజీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏపీ ఈపిడిసిఎల్ నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య ఆరోగ్య సదుపాయాల అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యాలని, తగిన సిబ్బంది, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

అర్బన్ తహసిల్దార్, రవాణా శాఖలు: లాజిస్టిక్, రవాణా ఏర్పాట్లు చెయ్యాల్సి ఉందన్నారు. పరీక్షా కేంద్ర సూపరింటెండెంట్ & సహాయక చీఫ్ సూపర్వైజర్లు పరీక్ష నిర్వహణ పర్యవేక్షణ, అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆయా రూట్ లలో బస్సులు ఏర్పాటు చేసి, పరీక్షా కేంద్రం వద్ద ఆర్టీసీ అధికారులు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చెయ్యాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఏపీపీఎస్సీ అధికారి ఎం. జగదీష్, మెడికల్ అధికారి టి. శ్రీనివాస్, అర్బన్ తహసిల్దార్ పి హెచ్ జీ ఆర్. పాపారావు, స్టేషన్ ఇన్స్పెక్టర్ పీవీఎన్ స్వామి, సహాయ చీఫ్ సూపర్వైజర్ ఎస్.వి. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arrangements for the written

You cannot copy content of this page

Scroll to Top