పెదపూడి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి, అనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ , వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధిసబ్బెళ్ళ కృష్ణారెడ్డి గ్రామ వైఎస్సార్సీపి సమకూర్చిన పదివేల రూపాయలు నగదు, బియ్యం, దుస్తులు బాధిత కుటుంబానికి అందించిన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి పలువురు పార్టీ నాయకులు
పెదపూడి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడిన అగ్ని ప్రమాదంలో నివాసగృహం కాలిపోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున స్థానిక అధికారులు పాలకులు ఆర్థిక సహాయం అందించి గృహ నిర్మాణము మంజూరు చేసి ఆదుకోవాలని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు
పెదపూడి లో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి సహాయంగా పెదపూడి గ్రామ వై ఎస్ ఆర్ సి పి సమకూర్చిన పదివేల రూపాయల నగదు, బియ్యం,దుస్తులను బాధితుడు కిలాడి లోవరాజు కుటుంబ సభ్యులకు అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, పలువురు నాయకులు చేతుల మీదుగా శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్థానికంగా అందుబాటులో లేనందున పార్టీ తరఫున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలని ఆదేశించారని దీనిపై ఈరోజు ఇక్కడ కి వచ్చామని బాధితుడు లోవరాజు కుటుంబం నిరుపేద కుటుంబం అని, పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని
ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి గృహ నిర్మాణ రుణం మంజూరు చేసిప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల పార్టీ కన్వీనర్ గుత్తుల వెంకటరమణ, నియోజకవర్గం వివర్స్ సెల్ అధ్యక్షులు పప్పు సింహాచలం, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి, ఎంపీటీసీ సమ్మంగి దుర్గాప్రసాద్, పెద్దాడ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షీ కృష్ణ, వైఎస్సార్సీపి నాయకులు పంపన రమణ ,కాకర సాయిబాబా, నర్ల శ్రీను ,అందుగుల అబ్బు ,మారిన వెంకట్రావు ,కొంగర భద్రం, కిలాడి కుమార్, పప్పు జానకిరామ్, కాటయ్య, చుక్క దుర్గారావు, వందే సతీష్, మరాడి చిన్న సత్తిబాబు, పల్లంటి శివ ,చెల్లూరి శ్రీను, చుక్క దుర్గారావు, బోరాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


