TRINETHRAM NEWS

మీరు చిట్ ఫండ్స్ కడుతున్నారా.. జర భద్రం

చిట్ ఫండ్స్ కట్టే ముందు దాని నియమ నిబంధనలు గురించి తెలుసుకోండి…

భారత దేశంలో చిట్ ఫండ్స్ వ్యాపారం చట్టం 1982 ద్వారా నిర్వహించబడాలి.

1) చిట్ ఫండ్స్ చట్టం 1982 లోని సెక్షన్ 4(1) ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి.

2) ఈ అనుమతి కోసం దరఖాస్తు చిట్ ఫండ్ యజమాని సబ్- రిజిస్ట్రార్, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కు చేసుకొని అనుమతి పొందాలి.

3)చిట్ ఫండ్ వ్యాపార యజమాని ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసే ముందు ఎంత వరకు చిట్ వ్యాపార మొత్తాన్ని (డబ్బును) ప్రారంభించాలని అనుకుంటాడో అంతకు సమాన మైన మొత్తాన్ని రిజిస్ట్రార్ పేరు మీద జాతీయ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి.

4) చిట్ ఫండ్ వ్యాపారానికి ప్రభుత్వ అనుమతి పొందిన కాపీని పాట ప్రారంభానికి ముందు ప్రతీ చందాడారునికి అందించాలి.

5) డిస్కౌంట్ నుంచి చిట్ ఫండ్ యజమాని పొందే కమీషన్ మొత్తం 7 శాతానికి మించకోడడు.

6) చిట్ ఫండ్ యజమాని ఒక్కరే ఐతే ఆయనకు అనుమతించబడిన గరిష్ఠ చిట్ మొత్తం 3 లక్షల రూపాయలు మాత్రమే.

7) అదే చిట్ ఫండ్ వ్యాపారాన్ని ఒక సంస్థగా చేసి అందులో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉంటే వారికి అనుమతించబడిన గరిష్ట చిట్ మొత్తం 18 లక్షల రూపాయలు.

8) ఒక సంస్థలో నలుగురు కంటే తక్కువ మంది సభ్యులు ఉంటే ఆ సంస్థకు అనుమతించబడిన గరిష్ట చిట్ మొత్తం 3 లక్షల రూపాయలు మాత్రమే.

9) చిట్ ఫండ్ యజమాని తప్పకుండా మినిట్స్ బుక్ ను ఉపయోగించాలి. పాటకు వచ్చిన ప్రతీ సభ్యుని చేత సంతకం చేయించు కోవాలి, పాటకు రానియెడల రెండు రోజుల్లో వారి సంతకాన్ని తీసుకోవాలి..

మరిన్ని విషయాలతో రేపటి న్యూస్ అప్డేట్స్ లో..