Araku Police Department : గ్రామీణ యువతకు వరంగా మారిన అరకు పోలీస్ శాఖ

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 30, (త్రినేత్రంన్యూస్).. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల పరిధిలో పీసీ, ఎస్సై , డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు అరకు వ్యాలీ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అరకు వ్యాలీ మండలంలోని వివిధ గ్రామాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సుమారు 150 మంది అభ్యర్థులకు అరకు పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించారు. పరీక్షను నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించినట్లు పోలీసు వారు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ ఎస్సై జి. గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై గోపాలరావు మాట్లాడుతూ, ముందస్తుగా కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ఈ అవకాశంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశముందని, ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఇది కీలకంగా మారుతుందని తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు కూడా పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ, తమ భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపడుతున్న ఈ తరహా కార్యక్రమాలు అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Araku Police Department becomes a boon for rural youth

You cannot copy content of this page

Scroll to Top