Trinethram News : వినుకొండ నియోజకవర్గం, వినుకొండ రూరల్ మండలం జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని గ్రామంలోని ఆడపడుచులు, అన్నదమ్ములకు చీరలు మరియు పంచలు పంపిణీ కార్యక్రమాన్ని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంకాయలపాటి నాగేశ్వరావు, గొట్టం గోవిందరాజులు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ని ఆహ్వానించారు.
గ్రామానికి వచ్చిన బ్రహ్మనాయుడు కి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికి, ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా గ్రామంలోని ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


