అరకులోయ, జనవరి 8,(త్రినేత్రంన్యూస్): ఐటిడిఏ పాడేరు పరిధిలోని అరకు వ్యాలీ గిరిజన మ్యూజియం వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇవ్వనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ షాపులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా అరకు వ్యాలీ మండల పరిధిలో నివసించే గిరిజన నిరుద్యోగ యువతీ యువకులై ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు పదవ తరగతి ఉత్తీర్ణత పొంది, 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రతి నెల 5వ తేదీలోపు క్రమం తప్పకుండా అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అలాగే దరఖాస్తుదారునికి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు జామీనుదారులుగా ఉండడం తప్పనిసరి అని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఒక లక్ష రూపాయల విలువైన బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) సమర్పించాల్సి ఉంటుందని, ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎంపిక కాని అభ్యర్థులకు డిమాండ్ డ్రాఫ్ట్ తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు.
అర్హతలు కలిగి, నియమ నిబంధనలను అంగీకరించిన అభ్యర్థులు 07-01-2026 నుండి 19-01-2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక 20-01-2026 న లాటరీ పద్ధతిలో నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే వారు (ఐటిడిఏ), పాడేరు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.
ఒక అభ్యర్థి ఒక్క దరఖాస్తు మాత్రమే సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని అరకు వ్యాలీ మండలంలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు పూర్తిగా వినియోగించుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


