అమరావతి : ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్‌కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

