WhatsApp Image 2024 03 10 at 10.53.36
Trinethram News : తమిళనాడు: భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది.
మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ త్రీడీ ముద్రణ పరిజ్ఞా నంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘అగ్నిబాణ్ ఎస్ఆర్టీఈడీ’ని ప్రయోగించ నుంది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట ఇందుకు వేదిక కానుంది. భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ 2022 నవంబరు 18న నిర్వహించింది.
