అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Annadanam

Annadanam : కూకట్‌పల్లి, సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్ : వినాయక చవితి సందర్భంగా కూకట్‌పల్లిలోని వినాయక మండపం వద్ద బజరంగ్ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్మయ్య నవీన్ ఎమ్మెల్సీ, ప్రముఖ వ్యాపారవేత్త కె. కొండల్‌రావు సౌజన్యం అందించారు. వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు, భక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బజరంగ్ వినాయక భక్త బృందం సభ్యులు సుదర్శన్‌రావు, కార్తీక్‌రావు, సురేష్, భాస్కర్, పాలమూరు మాణిక్‌రెడ్డి, మోలుగు శ్రీను, ఎంఎస్‌పీ రావు, అస్రావు, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నదానంలో పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page