
Vinayaka Chavithi Celebrations : ఖమ్మం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16 ; సత్తుపల్లి నియోజకవర్గం, మండలం లో గల గ్రామాలలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి . సత్తుపల్లి బస్ స్టేషన్ ప్రాంగణంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సిబ్బందితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు . విగ్రహ దాత జి లక్ష్మీనారాయణ, బాలస్వామి, దొరబాబు, జీవి రావు, జిఎస్.ఎన్ రెడ్డి, దుర్గారావు, ఎస్ ఎస్ రావు, కె ఆర్ ఎల్ రావు, పూజలు చేశారు. విగ్రహ దాత జి లక్ష్మీనారాయణ దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు.
సత్తుపల్లి నుండి సిద్ధార్థ వెళ్లే రోడ్డు మార్గంలో షాపుల యాజమాన్యం సంఘం అధ్యక్షులు ప్రసాద్ రావు, దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు మొదలయ్యాయి. మండలంలోని కొన్ని గ్రామాలలో రంగ రంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. గౌరీ గూడెం గ్రామంలో మణికంఠ, హర్ష రెడ్డి, మూర్తి జస్వంత్, ఎం సాయి, వి చరణ్, భరత్, ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గుడిమెట్ల గాంధీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేశారు. రవ్వ లడ్డులు, పండ్లు, మిఠాయిలు పూలదండలు, డబ్బుల దండలు అర్పించారు.
వర్షాలు పుష్కలంగా కురిసి పంటల పండాలని, ప్రజలందరి కుటుంబంలో ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా , సిరిసంపదలు కలిగి , మంచి సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ ఉండాలని, ఆ వినాయక కమిటీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నారు. వాళ్లు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు రావాలని కోరుకున్నారు. ఎన్ని రోజులు పూజలు చేస్తారో వివరించారు. త్వరలో అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆ గణనాథుడు ఊరేగింపులు కూడా డప్పు వాయిద్యాలతో, తాళమేళాలతో ఊరేగింపు నిమజ్జనం చేస్తామని వెల్లడించారు . అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe