అనపర్తి ఓల్డ్ టౌన్ విద్యార్థిని మాధురికి తృతీయ బహుమతి

TRINETHRAM NEWS

వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన.. జిల్లా స్థాయి పోటీల్లో అనపర్తి ఓల్డ్ టౌన్ విద్యార్థిని కే మాధురికి తృతీయ స్థానం లభించగా జిల్లా జాయింట్ కలెక్టర్ మెఘా స్వరూప్ చేతుల మీదుగా అందుకుంది. వినియోగదారుల దినోత్సవం వేడుకలు బుధవారం.. రాజమండ్రి వీటి ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.

అనపర్తి ఓల్డ్ టౌన్ విద్యార్థిని మాధురి ఈ సందర్భంగా నిర్వహించిన ఇంగ్లీష్ వ్యాసరచన పోటీలో జిల్లాస్థాయిలో తృతీయ స్థానం సంపాదించింది. ఈ మేరకు మాధురి, గైడ్ టీచర్ టీ బంగారు నాయుడుకి 2000 రూపాయలు క్యాష్ ప్రైస్, ప్రశంసా పత్రము జాయింట్ కలెక్టర్ స్వరూప్, జిల్లా వినియోగదారుల
జడ్జ్ ప్రసాద్, ఆర్డిఓ కృష్ణ నాయక్ డీఈవో కే వాసుదేవరావు, ఏఎస్ఓ పార్వతి డి.ఎస్.పి బి విద్య, వినియోగదారుల ఫారం అధ్యక్షులు అనంతరామ్ చేతుల మీదగా అందుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కె సుజాత, ఉపాధ్యాయ సిబ్బంది మాధురిని తర్ఫీదు ఇచ్చిన సోషల్ అసిస్టెంట్ టి బంగారు నాయుడిని అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anaparthi Old Town student Madhuri bagged third prize

You cannot copy content of this page

Scroll to Top