ఎమ్మార్పీఎస్ టీఎస్ చందంపేట అధ్యక్షులు అందుగుల సైదులు.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 6 త్రినేత్రం న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి విశ్వ మానవుడు భారతరత్న అణగారిన వర్గాల దళిత గిరిజన పీడిత ప్రజల ఆశాజ్యోతి స్వేచ్ఛ సమానత్వం సమ సమాజానికి సమానత్వాన్ని కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అందుగుల సైదులు మాట్లాడుతూ బానిస సంకెళ్లను తెంచి భారత రాజ్యాంగాన్ని రచించి అట్టడుగు వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి ఓటు హక్కును అందించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు డిసెంబర్ 06 1956న తండ్రి అంబేద్కర్ అస్తమించాలని ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొమ్ము ఉదయ్ కుమార్ తరి గోవర్ధన్ భాస్కర్ శివ గోపి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


