Alumni Reunion : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) అక్టోబర్ 26 త్రినేత్రం న్యూస్.డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981- 82 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని ,విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యంలో ఒకచోట చదువుకున్న వారంతా నాలుగున్నర దశాబ్దాల అనంతరం ఒకే చోట కలుసుకునే కార్యక్రమం నాడు తరగతి గదిలో చేసిన చిలిపి చేష్టలు మామిడి చెట్లు, చింత చెట్లు ఎక్కి కాయలు కోయడం చిలిపిచేష్టలను ప్రశ్నించిన ఉపాధ్యాయులు తమ చిలిపి చేష్టలను ప్రశ్నించిన తీరు సవరించిన మార్గం అన్ని విషయాలను బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా తమ తోటి స్నేహితులు మరణించిన ఎనిమిది మందితో పాటు ఉపాధ్యాయులకు సంతాపం తెలిపి సమావేశం ప్రారంభించారు. నాటి గురువులు జగపతిరావు మాలతమ్మలను ఘనంగా శాలువాలతో సన్మానించి ఆనాడు తరగతి గదిలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఒకే చోట భోజనాలు చేసి ఒకరికొకరు గుర్తులుగా సెల్ఫీలు ,ఫోటోలు తీసుకున్నారు .

ఈ కార్యక్రమంలో సెక్రటేరియట్ అదనపు కార్యదర్శిగా పదవి విరమణ చేసిన మాధవరం నరేందర్ రావు తో పాటు ఆర్గనైజర్లు బిక్కుమల్ల శ్రీనివాసులు, గుమ్మడవల్లి శ్రీనివాస్, జూలూరు నగేష్, శ్రీరామదాసు మధుసూదనాచారి, తో పాటు పానుగంటి లక్ష్మీనరసింహ, రాజేందర్ రెడ్డి, శ్రీనివాసులు, సభావట్ రాములు, ఏసోబు, తిరుపతయ్య, రాజేశ్వరి, అరుణమ్మ, విజయమ్మ, తదితరులు ఉన్నారు అనంతరం కార్యక్రమం ఏర్పాటులో కీలక భూమిక వహించిన మాధవరం నరేందర్రావును పదవీ విరమణ పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 35 మంది ఉన్నారు. పాల్గొన్న వారందరికీ గుర్తింపుగా మెమొంటోలు బహుకరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Alumni reunion

You cannot copy content of this page

Scroll to Top