Jale Brothers : శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళం అందించిన జాలే *బ్రదర్స్

TRINETHRAM NEWS

ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టు కున్నారు .
— చింత చెట్టు గ్రామ ప్రజలు.

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని గాజినగర్ ఉమ్మడి పంచాయతీ అయిన చింతచెట్టుతండా గ్రామంలో నాడు 2023 శాసన సభ ఎన్నికల్లో ఆ గ్రామ ప్రజలు మా ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రహరీగోడ కట్టాలని కోరడం జరిగింది నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రహరీగోడ కొరకు జాలె నరసింహారెడ్డి, మరియు తిలక్ రెడ్డిలు 5,60,000 రూ,, అక్షరాల ఐదు లక్షల అరవై వేల రూపాయలు విరాళం అందించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు .

అనంతరం ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు మా ఉరికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రహరీగోడ కొరకు ఐదు లక్షల అరవై వేల రూపాయలు విరాళం అందించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలుపుతూ వారిపై వారి కుటుంబ సభ్యులపైన ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు..

ఈ కార్యక్రమంలో అమ్మిలాల్, దాస్య, శ్రీను నాయక్, రవి, హరిసింగ్, సూర్య, శాంత్య, బావోజి, హేమానాయక్, రవి, దత్త, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale *Brothers who donated

You cannot copy content of this page

Scroll to Top