former MLA Satthi : శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సత్తి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం అరికరేవుల గ్రామం లో శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు.

బిక్కవోలు మండలం అరికరేవుల గ్రామం లో శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి నూతన విగ్రహ ఆలయగోపురం వినాయక,లలితా త్రిపుర సుందరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించబడింది.

ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం , పంచగవ్య ఆరాధన , పంచగవ్య ప్రాశన , అగ్ని మధనం, నవగ్రహ పూజ, ప్రధాన కుంభారోహణం, పంచగవ్య , క్షీర, జలాధివాసం, ఆదివాస హోమం , పాయశ హోమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు,
తొండాపు సూర్యనారాయణ రెడ్డి (సూర్రెడ్డి)(ఆలయ కమిటీ నిర్వహణాధికారి), మరియు శ్రీమతి లలిత దంపతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తొండపు గాంధీరెడ్డి (గ్రామ కమిటీ సర్పంచ్), కొర్ర చక్రధర్ రావు (ఆరికరేవుల ఎంపీటీసీ), కొర్ర శ్రీనివాసరావు , బొడ్డు సూరిబాబు, బొడ్డు భాస్కరరావు ,పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), బొడ్డు ముత్యాలరావు గురి నాగేశ్వరరావు మహిపాల సత్తి బాబు, మహిపాలఆదినారాయణ, కొర్ల నాగేశ్వరరావు, కడియం గోవిందు, బొడ్డు బాసి , కొర్ల వీరశేఖర్ తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

former MLA Satthi

You cannot copy content of this page

Scroll to Top