త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం. బలభద్రపురం – కాపవరం చెత్త నుండి విద్యుత్ పరిశ్రమ ప్రపోజల్ అంశంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే, సత్తి సూర్యనారాయణరెడ్డి, వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే, నల్లమిల్లి
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
ఇటీవల కాపవరం గ్రామంలోని 12 ఎకరాల జెప్పీ భూమిలో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ గురించి వార్తలు రావడం దానిపైన మాజీ ఎమ్మెల్యే, సూర్యనారాయణరెడ్డి, ప్రెస్మీట్ పెట్టడం అలాగే మా అబ్బాయి మనోజ్ రిసెప్షన్ తర్వాత ఒక ప్రెస్మీట్ పెట్టడం జరిగింది
గడచిన ఐదేళ్ళుగా నన్ను చాలా అగౌరవంగా, అమర్యాదగా, ఏకవచనంతో సంభోధిస్తూ మాట్లాడిన సూర్యనారాయణరెడ్డి,గత రెండు ప్రెస్మీట్ లలోనూ, అని సంభోధిస్తూ మాట్లాడటం జరిగింది. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను,
చెత్త నుండి సంపద కేంద్రం వివాదంపై మాట్లాడిన వారిని, వారి నాయకులను ప్రశ్నిస్తున్నా.. రెండు నైలల నుండీ గ్రామ సర్పంచ్ పైన, తహశీల్దారు పైన, ఆర్ డి ఓ పైన, పంచాయితీ సెక్రటరీ పైన తీవ్రమైన ఒత్తిడి తెస్తా ఉన్నారు అని ఆరోపిస్తున్న మీరు రెండు నెలల నుండి గాడిదలను కాచారా? అని అడుగుతున్నా. రెండు నెలల నుండి మీరు నోరు ఎందుకు ఎత్తలేదు అని అడుగుతున్నా
నేను మాట్లాడితే తప్ప మీకు నోరు పెగలలేదా? ఎందుకు మీరు నేను మాట్లాడేంత వరకూ మౌనం వహించారు? రెండు నెలల నుండి మీకు బేరసారాలకు ప్రయత్నించారా అని అడుగుతున్నా?
బేరం కుదరలేదా? లేక నేను మాట్లాడటం వలన మీ బేరసారాలు ఫెయిలయ్యాయా? అందువలనే మాట్లాడుతున్నారా ఇపుడు
మీకు అక్కడ ఉన్న నాయకుల గురించి అందరికీ తెలిసిందే. నల్లమిల్లి చంద్రకళ పేరుతో వెదుళ్ళ చెరువు నుండి ఏ విధంగా మట్టి తరలించుకుపోయారో అందరికీ తెలుసు
2023 లో బలభద్రపురం నుండి వచ్చే చెత్తను తెచ్చి కాపవరం గ్రామంలో డంప్ చేయమని ఎన్ ఓ సి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆరోజు కాపవరం గ్రామ సర్పంచ్ ఎందుకు మాట్లాడలేదు? మీరెందుకు మాట్లాడలేదు?
అనపర్తి గ్రామంలోని చెత్తంతా కాలువ గట్లపై వేసినపుడు మీరెందుకు మౌనం వహించారు?
గ్రాసిం ఇండస్ట్రీ మొదట్లో కేపీర్ సంస్ధ. కేపీర్ సంస్ధకు వ్యతిరేకంగా పోరాడింది తెలుగుదేశం పార్టీనే. 2012 నుండి సమస్య ఉన్నపుడు మేము పోరాడుతుంటే మీరేం చేసారు? ప్రెస్ వాళ్ళు పిలిస్తే కేపిఆర్ దెబ్బ తట్టుకోలేం అని చెప్పిన మీరు చేతగాని వాళ్ళా? పోరాటం చేసిన మేము చేతగాని వాళ్ళమా?
2014-19 కాలంలో ఒక్క ఇటుక ముక్క కూడా అక్కడ పెట్టకుండా మేం నిరోధించగలిగాం.
మీరు నిన్న పంపిన కాగితాలు భూమి బదలాయింపు కాగితాలు. కేపీర్ సంస్ధ గ్రాసిం సంస్ధకు అమ్ముకోవడం జరిగింది. భూబదలాయింపు సాధారణంగా జరిగేదే. దాన్నే కేబినెట్ లో ఆమోదించారు అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిన సాధారణ ప్రక్రియ
నా దృష్టికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి,కి సమస్యను వివరించగానే వారు కలెక్టరు,కి అక్కడ ఏ విధమైన పనులు జరుగకుండా చూడమని ఆదేశాలు ఇవ్వడం తదనుగుణంగా నాడు అది ఆగిపోవడం జరిగింది.
2019 ఎన్నికల సమయంలో దీన్ని తీసుకువెళ్ళి సముద్రతీర ప్రాంతంలోనో, ఎస్ ఈ జేడ్ లోనో పెట్టుకోమని మామిడాడ బహిరంగ సభలోనో మీ అధినేత జగన్మోహనరెడ్డి, మాట్లాడలేదా? కానీ ఆ తర్వాత మీరేం చేసారు?
దగ్గరుండి మరీ గ్రాసిం సంస్ధ నిర్మాణం పూర్తి చేసారు మీరు? కాంట్రాక్టులు తీసుకున్నారు. గ్రాసిం యూరాలజీ సెంటర్ పేరుతో హాస్పిటల్ కట్టించుకుని వాళ్ళకు తొత్తులుగా మారి వాళ్ళకు కావలసిన పనులు చేయించారు మీరు
రెండో విడత విస్తరణ కోసం జరిగిన పబ్లిక్ హియరింగ్ సందర్భంగా మీరేం మాట్లాడారు? మెడిసిన్ లో పిజి చేసిన మీకు పొల్యూషన్ గురించి తెలియకపోవడం అవివేకం అనుకోవాలా?
ఆరోజు సంబంధం లేని గ్రామాల నుండి వైసిపి నాయకులను తీసుకువచ్చి గ్రాసిం కి అనుకూలంగా బలప్రదర్శన ఎందుకు చేయించారు?
ఈరోజు బలభద్రపురంలో 200 మందికి పైగా కేన్సర్ బారిన పడటానికి కారణం ఏమిటి? గ్రాసిం వలనే ఇదంతా అని స్ధానికుల అభిప్రాయం. అక్కడ వాటర్ కి సంబంధించిన టిడియస్ ఏ స్ధాయిలో ఉంది? అసలు టిడియస్ అంటే మీకు తెలియదేమో?
ఆనాడు గ్రాసిం కి వ్యతిరేకంగా మేం పోరాడుతుంటే మీరు, మీ నాయకులు ఎంత దారుణంగా వ్యవహరించారో గుర్తులేదా? పంచాయితీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటే మీ నాయకులు ఎంత వ్యతిరేకించారో మరచిపోయారా?
చెత్త నుండి విద్యుత్ కేంద్రాన్ని తీరప్రాంతంలో పెట్టమని నేడు సలహా ఇస్తున్న మీరు నాడు గ్రాసిం విషయంలో ఇదే సలహా ఇచ్చిన మీ నాయకుడి మాటలు మీరెందుకు పాటించలేదు?
చెత్త నుండి సంపద కేంద్రం విషయంలో మీరు నన్ను చేతగాని ఎమ్మెల్యే, అంటున్నారు కానీ చేతగాని ఎమ్మెల్యే, అనే మాటకు అనపర్తి నియోజకవర్గంలో బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిలిస్తే చెప్పిన పని చేసే ఎమ్మెల్యే, గా నేను బ్రాండ్ అంబాసిడర్ ని అని అందరికీ తెలుసు,
మీరు సమాజంలోనే కాదు సాక్షాత్తూ మీ కుటుంబంలోనే చేతగాని వ్యక్తి మీరు. దాని ప్రభావం గడచిన ఎన్నికలలో ఎంతపడిందో మీ అధినేతకు కూడా తెలుసు,
ఏవిధంగా కుటుంబ పాలన సాగిందో.. మీ గృహస్ధాశ్రమంలో మీ చేతగాని తనాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారో సింగంపల్లి షిప్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం వసూలు చేసిన లంచాల విషయంలో రుజువైన సంగతి మరచారా? మీరా చేతగానితనం గురించి మాట్లాడేది?
అచ్యుతాపురత్రయం గ్రామంలో బంగారు బిస్కెట్ల లంచం విషయాన్ని నిరోధించలేని చేతగాని మనిషి మీరు చేతగానితనం గురించి మాట్లాడతారా?
నాది చేతగానితనమో చేతనైనతనమో చెత్త నుండి సంపద కేంద్రం విషయంలో నేను స్పందించిన తీరే చెపుతుంది, ప్రజలను ఇంక మోసగించవద్దు సూర్యనారాయణరెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


