మండపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో స్ధానిక కరాచి సెంటర్ వద్ద పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, ఆధ్వర్యంలో వంగవీటి రంగా 78వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, సాధనాల చక్రపాణి, పెదపాటి సత్తిబాబు, కందుల శ్రీను, పెందుర్తి ప్రధీప్, శెట్టి రవి, పాలచర్ల శిరీష్, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


