Alliance Leaders : దండబడు గ్రామ తాగునీటి సమస్యకు కూటమి నాయకులు పరిష్కారం

TRINETHRAM NEWS

అనంతగిరి, నవంబర్ 30, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయితీ దండబడు గ్రామంలో గత కొన్ని రోజులుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న త్రాగు నీటి సమస్యకు కూటమి నాయకులు ముందుకు వచ్చి పరిష్కారం చూపించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి, టిడిపి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్ కలిసి గ్రామ ప్రజల సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామంలోని నీటి కొళాయిలు దెబ్బతిన్న కారణంగా తాగునీటి సరఫరా కష్టంగా మారిందని తెలుసుకున్న అనంతరం, పంచాయతీ సర్పంచ్ సింహద్రి, పంచాయతీ సెక్రటరీ షేక్ మౌలాలితో కూటమి నాయకులు ప్రత్యేకంగా చర్చించారు. పంచాయతీ నిధులతోనే కొళాయిలను పూర్తిగా మరమ్మత్తు చేసి, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా పునరుద్ధరించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా గిరిజన గ్రామాలలో సీసీ రోడ్లు, త్రాగు నీరు వంటి ప్రాథమిక సౌకర్యాల విస్తరణకు రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇదే దిశగా దండబాడు గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని మండల అధ్యక్షుడు చిట్టం మురళి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింహద్రి, మట్టం శ్యామ్, సెక్రటరీ షేక్ మౌలాలి, కూటమి నాయకులు రమేష్, బుజ్జిబాబు, బీమన్న, సన్యాసిరావు, సంధిఫ్, వార్డు మెంబర్ సన్యాసి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అర్జున్ సహా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Alliance leaders come forward to solve the drinking water problem

You cannot copy content of this page

Scroll to Top