Trinethram News : విషాదకరమైన వార్త అంబేద్కర్ కానసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఎస్ఐ అశోక్ తో పాటుగా, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ అక్కడికక్కడే మృతి చెందారు. తలకి బలమైన గాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


