వరంగల్ జిల్లా 28-జూన్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ ఆధ్వర్యంలో డి.ఎం. అండ్.హెచ్.ఓ.కార్యాలయలో శనివారం రోజున నర్సంపేట డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ/ డిస్టిక్ ఇమినైజేషన్ ఆఫీసర్ డాక్టర్.ఐ ప్రకాష్ , వర్ధన్నపేట డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్ కొమురయ్య ఇద్దరికీ కలిపి ఒక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జూలై 09న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా మహాధర్నా కార్యక్రమానికి వెళ్తున్నామని ఇట్టి సందర్భంగా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని, వరంగల్ జిల్లాల పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ 78 క్యాడర్స్ ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని జన్ను కొర్నోల్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఇద్దరు కలిసి మాట్లాడుతూ… ప్రభుత్వం 7 నెల ఏరియర్స్ బకాయిలు వెంటనే ఇవ్వాలని, ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల్లో ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ,పి.ఎఫ్.,ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధం జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ ,వరంగల్ జిల్లా అధ్యక్షుడు జన్ను కొర్నోల్, ఏఐటియుసి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు యాకూబ్ పాషా, మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


