Collector : మంథని మండలం రామయ్యపల్లి గ్రామంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

మంథని, జూన్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విద్యార్థులు చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని మండలం రామయ్యపల్లి గ్రామంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మంటరీ రూమ్, కిచెన్, జూనియర్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించారు.
రెసిడెన్షియల్ పాఠశాలలోని రైస్ స్టాక్, కూరగాయలను తనిఖీ చేసిన కలెక్టర్ నీట్ గా మేయింటేన్ చేస్తున్న సిబ్బందిని అభినందించారు విద్యార్థులతో కలెక్టర్ ఇంటారాక్ట్ అయ్యారు. విద్య బోధన ఎలా జరుగుతుంది, హాస్టల్ లో భోజనం నాణ్యత, వసతులు ఉన్నాయా, పారిశుధ్యం ఎలా ఉంటుంది, వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ బాగా చదువుకోవాలని, విద్య ద్వారా జీవితంలో మంచి మార్పులు సాధ్యం అవుతాయని, గొప్ప స్థాయికి చేరుకునేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని స్వీకరించాలని, ప్రతిరోజు కొంత వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector conducts surprise

You cannot copy content of this page

Scroll to Top