HDFC బ్యాంకుతో సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం అమలు చేయాలి
PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 1 పరిధిలోని గోదావరి గెస్ట్ హౌస్ లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న చక్రి అనే కాంట్రాక్ట్ కార్మికుడు నిన్న పెద్దపళ్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ ఘటన పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఆ కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికులంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ సింగరేణి యాజమాన్యం HDFC బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయించి ప్రతి నెల వేతనాలు ఇదే బ్యాంకు ద్వారా అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకున్నది. ఈ బ్యాంకుతో ఫినివేని యాజమాన్యం ఒప్పందం కూడా చేసుకుంది.
ఈ బ్యాంకులో ఖాతా ఉండి వేతనం తీసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదంలో మరణించినట్లయితే 40 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింప చేస్తామని ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క చైర్మన్ శ్రీ బలరాం ప్రకటించడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారంగా గెస్ట్ హౌస్ కార్మికుడు ప్రమాదంలో మరణించినందున 40 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ఇలాంటి షరతులు లేకుండా వర్తింపజేయాలని బ్యాంకు యాజమాన్యాన్ని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఏటీఎం కార్డు ప్రతి నెల స్వైప్ చేస్తేనే ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని కొన్ని బ్యాంకులు అడ్డం పడుతున్న నేపథ్యంలో ఇలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు కార్మికుల ప్రమాదంలో మరణించినట్లయితే బ్యాంకుతో సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఇన్సూరెన్స్ ను వర్తింపజేయాలని కాంట్రాక్టు కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


