TRINETHRAM NEWS

ఏఐటీయూసీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 09 మార్చ్ 2025. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో నేడు సత్యనారాయణ రెడ్డి భవన్లో ఎఐటియుసి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ హాజరైన ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతున్న… కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి ఇప్పటికే కేంద్రము 60 శాతం మరియు 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఎన్ హెచ్ ఎం స్కీమ్ ఉద్యోగస్తులను శ్రమ దోపిడీకి గురిచేస్తుంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 510 జీవో 2018 రిలీజ్ చేసిందని అందులో కొన్ని క్యాడర్లకు మాత్రమే వేతనాలు పెంచడం మరి కొంతమందికి పెంచకపోవడం కొన్ని క్యాడర్స్ మిస్ చేయడం మిస్సయిన క్యాడర్లో 4000 మంది ఉద్యోగులు ఉన్నారని, మిస్సయిన క్యాడర్స్ అందరికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 మంది ఉద్యోగులకు క్యాడర్ ఫిక్స్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల యొక్క బేసిక్ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని,

హెల్త్ కార్డ్స్ ,హెల్త్ ఇన్సూరెన్స్, మహిళా ఉద్యోగుస్తులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి క్యాడర్కు 30 శాతం వెయిటేజ్ మార్కులు అమలు చేయాలని, ఏడు నెల పి.ఆర్.సి. ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని, అతి తక్కువ జీతాలు చెల్లించడం అన్యాయమని ఉద్యోగులందరూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించడం జరిగిందినీ , ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఐదు రాష్ట్రాలలో రెగ్యులరైజేషన్ చేశారని రెగ్యులరైజేషన్ చేసిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర ,మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా రెగ్యులరైజేషన్ చేయాలని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏస్. బాల్ రాజ్ , ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఏఐటీయూసీ ఉపాధ్యక్షురాలు ప్రేమ పావని, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ , వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AITUC Telangana State Council meeting