గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో జరగనున్న 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ పద్మశాలి మహాసభలను విజయవంతం కోసం పద్మశాలి కుల బాందవులు ఐక్యతగా ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాజమల్లు ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, అధ్యక్షతన పద్మశాలి సేవా సంఘం, అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా), మహిళా సంఘం, యువజన సంఘం ప్రతినిధులు, సభ్యులు బయలుదేరారు.
అలాగే ఆదివారం హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి ఐక్యత, అభివృద్ధి లక్ష్యసాధనలో హైదరాబాదులో ఈ మహాసభలు జరిగాయన్నారు. మహాసభలకు వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాదారులు సిరిపురం నర్సయ్య, పో.పా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, కోశాధికారి అనుమల లక్ష్మినారాయణ, అన్నల్ దాస్ శ్రీనివాస్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుల వేణు, కోశాధికారి తాటికొండ రవీందర్, కన్నం ప్రభాకర్, తాటిపాముల రాజేష్, పొరండ్ల కొమురయ్య, గొలి నాగేశ్వర రావు, సత్యనారాయణ, గాలి రాజేశం, వేముల శ్రీనివాస్, వెంకటేష్, చంద్రయ్య, శంకర్, కనకయ్య,రాజేష్, వెంగల నర్సయ్య, చింతల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, రాజమౌళి, సుదర్శన్, రమేష్, గుండెటి సంతోష్, మహిళా సంఘం నాయకురాల్లు పోరాండ్ల వసంత, అడేపు జ్యోతి, పద్మశాలి సభ్యులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


