ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Strict action

యాప్ లోనే ఇసుక బుక్ చేసుకోవాలి. డిండి ఎస్ ఐ. బాలకృష్ణ

Strict Action : డిండి (గుండ్లపల్లి) జులై 11, త్రినేత్రం న్యూస్ : డిండి మండల పరిధిలోని గోనబోయిన పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించి వాటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ బాలకృష్ణ తెలిపారు.మరియు డిండి మండల పరిధిలోని కందుకూరు వాగు నుండి శనివారం రోజు చెక్ డ్యాం పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.
కావున మండల ప్రజలు ఇసుక తప్పని సరిగా ప్రభుత్వము ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం యాప్ లో మాత్రమే బుక్ చేసుకుని తక్కువ ధరకు మాత్రమే ఇసుక పొందాలని సూచించారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page