AITUC : గోదావరిఖని లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం పలికిన ఏఐటియుసి నాయకులు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి నూతనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా గోదావరిఖని కి వస్తున్న సందర్భంగా ఆదివారం రోజున సింగరేణి గుర్తింపు సంఘం ఐన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం పలికింది.

గోదావరిఖని మున్సిపల్ జంక్షన్ నుంచి మార్కేండయ కాలనీ లోని ఆర్ కె గార్డెన్ వరకు జరిగిన ర్యాలీలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వివేక్ వెంకటస్వామి వెంట ఉంటూ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది, అనంతరం ఆర్ కె గార్డెన్ లో జరిగిన అభినందన సభలో ఏఐటియుసి పక్షాన వివేక్ వెంకటస్వామి ని నాయకులు ఘనంగా సన్మానించారు. సింగరేణి కి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పై ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వై. వి.రావు, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు తో పాటు ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AITUC leaders gave a

You cannot copy content of this page

Scroll to Top