గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి..
ఏ ఐ టీ యు సి జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు.
డిండి(గుండ్లపల్లి). అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. స్వాతంత్రానికి పూర్వం సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రహస్య జీవితాలు గడుపుతూ నాటి కార్మిక నాయకులు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాది భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని పోరాడుతూనే కార్మికుల అనేక కష్టాలు ,బాధలు ,ఆకలి దరిద్రం ,పేదరికానికి రైతు కార్మికులు 30 సంవత్సరాల పోరాటాల తర్వాత కార్మికుల ఆoడగ నిలబడేందుకు 31.10.1920న బొంబాయి నడి సముద్రంలో పడవలో రహస్యంగా సమావేశమై ఏఐటీయూసీ పేరును నామకరణం చేసి నేటికి106 సంవత్సరాలు అవుతున్నది.
1920 ఏర్పడ్డ నాటి నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్లు పెట్టుకొని కార్మిక హక్కు కావాలని ,నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెడలువంచి ప్రమాద నష్ట పరిహార చట్టం కావాలని, ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకునే చట్టం, వేతనాలు చెల్లింపు చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం ,కనీస వేతన చట్టం, ఫ్యాక్టరీ చట్టం, పీఎఫ్ ,ఈఎస్ఐ చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, కాంటాక్ట్ కార్మికుల ఫర్ మెంట్ చేయాలని చట్టం, బాల కార్మిక నిషేధచట్టం, భవన నిర్మాణ సంక్షేమ చట్టం, ఉపాధి నహామీ చట్టం, వీటితోపాటు 44 కార్మిక చట్టాలను పోరాటాలు చేసి సాధించుకున్న, ఘనత ఏఐటీయూసీ కి దక్కిందన్నారు..
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, 100 సంవత్సరాల ముందు సాధించుకున్న చట్టాల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు..అనంతరం డిండి మండల కేంద్రంలో 106 వ ఆవిర్భావ వేడుకల ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి. శ్రీరామదాసు కనకచారి, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు భుష్పాక లింగమయ్య, రమావత్ జవహర్ లాల్, ఎలిమినేటి దేవయ్య, రమేష్, కృష్ణయ్య, శక్రు,ఇద్దమ్మ ,కళ్యాణ్ ,లక్ష్మమ్మ సిపోరా, గెలవమ్మా ,సాలమ్మ, బాలమ్మ ,భాగ్యమ్మ ,భారతి, సుజాత సునీత లక్ష్మమ్మ తిరుపతయ్య, వెంకటయ్య, అంజయ్య , బాబు తదిరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


