AITUC : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

TRINETHRAM NEWS

కాంగ్రెస్ ఎన్నికల హామీ 10.000 జీతం వెంటనే అమలు చేయాలి మండల వనరుల కేంద్ర కార్యాలయం ముందు ధర్నా.
డిండి (గుండ్లపల్లి)ఆగస్టు 07 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై నేడు డిండి మండల వనరుల కేంద్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం మండల విద్యాధికారి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూవంట కార్మికులు గత 22 సంవత్సరాల నుండి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తునారు. వారి జీవితాల మాత్రం నెలల తరబడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్టుగానే ఉన్నది .ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో నత్త నడకగా వ్యవహరిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, సౌకర్యాలను కల్పించాలని కోడిగుడ్లను, వంట గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షులు బుష్పాక లింగమయ్య, ఎఐటియుసి సహాయ కార్యదర్శి రామావత్ జవహర్ లాలు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు, బలుమూరి లక్ష్మయ్య, సిగ అలివేలు, తబిత ,ఎల్లమ్మ, వెంకటమ్మ, పద్మ, బల్మూరి జంగమ్మ, మీసాల రాములమ్మ, తదిరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mid-day meal scheme workers' protest

You cannot copy content of this page

Scroll to Top